రెక్కలు ఇవ్వగలవా నాకు...?
రెక్కలు ఇవ్వగలవా నాకు...?
హిందీ : ప్రొఫెసర్ .రిషభ్ దేవ్ శర్మ .
తెలుగు : డా.పేరిశెట్టి శ్రీనివాసరావు.
పొత్తాలు అడిగాను నేను
పొయ్యి దొరికింది నాకు
స్నేహితుడ్ని కోరాను నేను
వరుడు దొరికాడు నాకు
కలల్ని కోరాను నేను
కష్టాలు వరించాయి నన్ను
బంధాలు కోరాను నేను
బంధనాలు దొరికాయి నాకు
నిన్న భూమిని అడిగాను
నేడు సమాధి దొరికింది నాకు
ఆకాశాన్ని అడుగుతున్నాను నేను
రెక్కలు ఇవ్వగలవా నాకు...?
డా . పేరిశెట్టి శ్రీనివాసరావు.
లెక్చరర్,పి.జి.విభాగము
దక్షిణ భారత హిందీ ప్రచార సభ
చిత్తూరు రోడ్ ,ఎర్నాకుళం (కేరళ)
సెల్ : 9989 242 343
ఈ -మెయిల్ : srperisetti@gmail.com
srperisetti@yahoo.com
''मुझे पंख दोगे'' के अनुवाद के लिए कृतज्ञ हूँ.
ReplyDeleteप्रेम बना रहे!